kcr: కేసీఆర్ పై విమర్శలు గుప్పించిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు

  • అవినీతిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది
  • కేసీఆర్ రెండో నిజాంలా మారారు
  • సోనియాగాంధీపై కేసీఆర్ విమర్శలు సరైనవి కాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు విమర్శలు గుప్పించారు. తెలంగాణలో కుటుంబ పాలన కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. సోనియాగాంధీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని అన్నారు. సోనియాపై అవినీతి ఆరోపణలు చేసిన కేసీఆర్... అవినీతిలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందనే విషయం మర్చిపోయినట్టున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రెండో నిజాంలా మారారని... సొంత మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఆయనను కలవలేరని విమర్శించారు. తెలంగాణను ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని... కానీ, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అసెంబ్లీ రద్దుకు ముందు మోదీ, అమిత్ షాలను కేసీఆర్ ఎందుకు కలిశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

kcr
Sonia Gandhi
dinesh gundurao
kpcc
modi
amith sha
congress
bjp
TRS
  • Loading...

More Telugu News