Tollywood: 'ఏఎన్ఆర్ మెచ్చిన నేటి తరం హీరో మహేష్ బాబే'... సుమంత్ ట్వీట్... స్పందించిన మహేష్!

  • ఇటీవల శతాధిక వృద్ధురాలిని కలుసుకున్న మహేష్
  • పెద్దలకు ఎంతో గౌరవం ఇచ్చే నటుడు మహేషన్న సుమంత్
  • ఏఎన్ఆర్ తనకు ఆదర్శమని బదులిచ్చిన మహేష్

నేటి తరం స్టార్ హీరోల్లో ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఏనాడో నిరూపించుకున్న మహేష్, తాజాగా, ఓ శతాధిక వృద్ధురాలిని కలుసుకుని, దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అక్కినేని ఫ్యామిలీ స్టార్ సుమంత్ స్పందించాడు.

 తన తాతయ్య ఏఎన్ఆర్ కు ఇష్టమైన నటుడు మహేష్ బాబేనని చెప్పాడు. "మీరు పెద్దవాళ్లకి ఎంతో గౌరవం ఇచ్చే నటుడు. మీరు ఈ తరంలో మా తాతకి ఎంతో ఇష్టమైన హీరో" అని సుమంత్ ట్వీట్ చేయగా, దీనిపై మహేష్ సైతం స్పందించాడు. "థ్యాంక్స్ సుమంత్... ఏఎన్‌ఆర్ గారు ఏన్నో విధాలుగా, ఎప్పటికీ నాకు ఆదర్శప్రాయులే" అని అన్నాడు. ఈ ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Tollywood
Mahesh Babu
Sumant
Twitter
ANR
  • Loading...

More Telugu News