chinarajappa: జనసేనలో చేరిన నాయకులంతా నిఖార్సైన వారా?: పవన్ కల్యాణ్ పై చినరాజప్ప విసుర్లు

  • పవన్ కల్యాణ్ కు రాజకీయ అనుభవం లేదు
  • దురుద్దేశంతోనే సుజనా చౌదరిపై ఈడీ దాడులు
  • జగన్ పై దాడి కేసు విచారణ కొనసాగుతోంది

టీడీపీ నేతలను దొంగలుగా పవన్ కల్యాణ్ అభివర్ణిస్తున్నారని...రాజకీయ అనుభవం లేకే ఆయన అలా మాట్లాడుతున్నారని ఏపీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జనసేనలో చేరిన నేతలంతా నిఖార్సైన వ్యక్తులని పవన్ చెప్పగలరా? అని సవాల్ విసిరారు. రాజకీయ దురుద్దేశంతోనే సుజనా చౌదరిపై ఈడీ దాడులు చేయించారని మండిపడ్డారు. ఇలాంటి దాడులకు తాము భయపడబోమని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడిని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకున్నాయని... కేసు విచారణ కొనసాగుతోందని తెలిపారు.

chinarajappa
Pawan Kalyan
Sujana Chowdary
Telugudesam
janasena
jagan
ysrcp
  • Loading...

More Telugu News