nagma: నగ్మా కోసం కొట్టుకున్న ఇద్దరు కాంగ్రెస్ నేతలు

  • మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం
  • దగ్గరగా వచ్చేందుకు ఎగబడ్డ జనం
  • గత ఎన్నికల్లో ఇదే అనుభవాన్ని చవిచూసిన నగ్మా

ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మాకు చేదు అనుభవం ఎదురైంది. మధ్యప్రదేశ్ శివపురి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్న సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆమెను చూసేందుకు, దగ్గరగా వచ్చేందుకు ఎగబడ్డారు. ఆమె కోసం స్టేజి మీద ఉన్న ఇద్దరు నేతలు సైతం కొట్టుకున్నారు. వారిని వారించే ప్రయత్నాన్ని నగ్మా చేశారు.

 అనంతరం ఆమె ప్రసంగించారు. నిర్ణీత సమయానికి సభాస్థలికి చేరుకోకపోవడంపై క్షమాపణలు చెప్పారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ వర్గీయులు అడ్డుకోవడం వల్లే జాప్యం జరిగిందని తెలిపారు. శివపురి, గ్వాలియర్, కరెరా తదితర ప్రాంతాల్లో ఆమె ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మరోవైపు, గత ఎన్నికల ప్రచారంలో కూడా నగ్మాకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఆమెను దగ్గర నుంచి చూసేందుకు అభిమానులు తోసుకురావడంతో... ఆమెకు చుక్కలు కనిపించాయి.

nagma
actress
Madhya Pradesh
elections
campaign
congress
  • Loading...

More Telugu News