cpi: ఫాంహౌస్ లో కేసీఆర్ క్యాప్సికం పండించుకోవాల్సిందే: నారాయణ

  • కేసీఆర్ నియంతృత్వం కారణంగానే మహాకూటమి ఏర్పడింది
  • దుష్ట పాలనను అంతమొందించడమే కూటమి లక్ష్యం
  • సోనియా, రాహుల్, చంద్రబాబుల ప్రచారంతో కూటమికి బలం చేకూరుతుంది

తెలంగాణను కేసీఆర్ నియంతలా పాలించారని... నియంతలానే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. కేసీఆర్ నియంతృత్వం కారణంగానే మహాకూటమి ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ దుష్ట పాలనను అంతమొందించడమే కూటమి లక్ష్యమని తెలిపారు. డిసెంబర్ 11వ తేదీ తర్వాత కేసీఆర్ ఫాంహౌస్ లో క్యాప్సికమ్ పండించుకోవాల్సిందేనని జోస్యం చెప్పారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, చంద్రబాబుల ప్రచారంతో మహాకూటమికి బలం చేకూరుతుందని అన్నారు. త్వరలోనే సోనియా, రాహుల్, చంద్రబాబులతో పాటు మహాకూటమిలోని ముఖ్య నేతలతో బహిరంగసభ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

cpi
narayana
kcr
prajakutami
Sonia Gandhi
Rahul Gandhi
Chandrababu
  • Loading...

More Telugu News