bellamkona: బెల్లంకొండ శ్రీనివాస్ సాహసం చేస్తున్నట్టే!
- బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి 'కవచం'
- వచ్చేనెల 7వ తేదీన విడుదల
- వీరభద్రం చౌదరికి ఛాన్స్
పరాజయాలను పెద్దగా పట్టించుకోకుండా భారీ విజయాలపైనే దృష్టి పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్, వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కవచం' రెడీ అవుతోంది. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డిసెంబర్ 7వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ మరో దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు .. ఆయనే వీరభద్రం చౌదరి. అల్లరి నరేశ్ హీరోగా 'అహ నా పెళ్లంట'తో తన కెరియర్ ను ప్రారంభించిన వీరభద్రం చౌదరి, ఆ తరువాత సక్సెస్ కి బాగా దూరమైపోయాడు. ఆయన చేసిన 'భాయ్'.. 'చుట్టాలబ్బాయ్' పరాజయాలపాలయ్యాయి. అలాంటి వీరభద్రం చౌదరికి బెల్లంకొండ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సాహసమేనని చెప్పుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పనిలోనే వీరభద్రం బిజీగా వున్నాడట. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.