jairamramesh: మతం పేరుతో రాజకీయాలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య: మాజీ మంత్రి జైరాంరమేష్‌

  • ఉత్తర ప్రదేశ్‌లో ఇదే ఎత్తుగడతో అధికారం చేజిక్కించుకుంది
  • ఇప్పుడు చత్తిస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ల్లో అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది
  • బీజేపీలో ఒకరే అమిత్‌ షా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో పది మంది ఉన్నారు

ఎన్నికల్లో గెలవడానికి మతపరమైన ఎజెండాను అమలు చేయడం భారతీయ జనతా పార్టీకి వెన్నతోపెట్టిన విద్య అని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్‌ ఆరోపించారు. ఆదివారం ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. మతపరంగా విడదీసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం భాజపా మొదటి నుంచి అనుసరిస్తున్న విధానమని విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో ఈ ఎత్తుగడతోనే అధికారం చేజిక్కించుకుందని, తాజాగా చత్తిస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఇదే వ్యూహాన్ని అమలు చేస్తోందని చెప్పారు. ఇటువంటి వ్యూహాలు అమలు చేయడానికి బీజేపీలో ఒకే అమిత్‌ షా ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌లో పది మంది అమిత్‌షాలు ఉన్నారని చెప్పారు.

jairamramesh
fires on BJP
  • Loading...

More Telugu News