Telangana: తెలంగాణలో నా అంత ప్రజాభిమానం ఉన్న నేత ఎవ్వరూ లేరు.. భవిష్యత్ లో కూడా ఎవరూ రారు!: కె.జానారెడ్డి

  • ఒకే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు గెలిచా
  • ఈ రికార్డు మరో నేత సాధించలేకపోయారు
  • నల్లగొండ జిల్లా ప్రచారంలో జానారెడ్డి వెల్లడి

తెలంగాణలో అత్యంత ప్రజాభిమానం ఉన్న నాయకుడు తానేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి కె.జానారెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం నుంచి 7 సార్లు గెలిచి తాను చరిత్ర సృష్టించానని చెప్పుకొచ్చారు. నాగార్జునసాగర్ ప్రజలే తనను మహానేతను చేశారని కొనియాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జానారెడ్డి నల్లగొండ జిల్లా నిడమనూర్ మండలంలో ఉన్న పలు గ్రామాల్లో పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘రాష్ట్రంలో ప్రజాభిమానం మెండుగా ఉన్న నేతను నేనే. ఒకే నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నాది. నాలాగా ఇన్నిసార్లు ప్రజాభిమానంతో గెలుపొందే నాయకుడు రాష్ట్రంలో ఎవ్వరూ లేరు.. ఇకపై ఎవరూ రారు’ అని వ్యాఖ్యానించారు.

ఈసారి తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి రావడం తథ్యమని జానారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమనీ, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను మట్టికరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Telangana
elections-2018
janareddy
great leader
Nagarjuna sagar
Congress
iam
the
maha kutami
TRS
  • Loading...

More Telugu News