maoists: ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు..భద్రాద్రిలో పోస్టర్లు
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-6a80b4505fe632a7c2f80611d2f9398494510ead.jpg)
- దేవరపల్లిలో పోస్టర్లు కనిపించడంతో కలకలం
- బూటకపు ఎన్నికలని ప్రజలకు సూచన
- పీఎల్‌జీఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపు
తెలంగాణ ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టులు మరోసారి పిలుపునిచ్చారు. ఇవి బూటకపు ఎన్నికలని, ఓటేయవద్దని కోరారు. గతంలోనూ మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని కోరుతూ మరో నియోజక వర్గంలో పోస్టర్లు అంటించారు. తాజాగా భద్రాద్రిలోని చర్ల మండలం దేవరాపల్లిలో మావోయిస్టుల పోస్టర్లు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఎన్నికలను బహిష్కరించాలని కోరడంతో పాటు డిసెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు జరిగే పీఎల్‌జీఏ వారోత్సవాలను జయప్రదం చేయాలని ఆ పోస్టర్లలో కోరారు. కాగా, మావోయిస్టుల పోస్టర్లతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.