Hyderabad: చాంద్రాయణగుట్ట బీజేపీ అభ్యర్థికి బెదిరింపులు.. గట్టి పోలీస్ భద్రతను కల్పించిన ప్రభుత్వం!

  • చాంద్రాయణగుట్ట నుంచి షహజాదీ పోటీ
  • దాడి చేస్తామంటూ సోషల్ మీడియాలో వార్నింగ్
  • పోలీసులను ఆశ్రయించిన బీజేపీ నేత

చాంద్రాయణగుట్ట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ షహజాదీకి తెలంగాణ ప్రభుత్వం గట్టి భద్రతను కల్పించింది. చాంద్రాయణగుట్టలో ప్రచారానికి దిగితే దాడిచేస్తామని కొందరు దుండగులు హెచ్చరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆమెకు ఇద్దరు గన్ మెన్లను కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఈ విషయమై ఫలక్‌నుమా ఏసీపీ డాక్టర్ రషీద్, దక్షిణ మండలం డీసీపీ అంబర్ కిశోర్ ఝా మాట్లాడుతూ.. షహజాదీపై దాడి చేస్తామని సోషల్ మీడియాలో కొందరు దుండగులు హెచ్చరించారని తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. భద్రత కోసం షహజాదీకి ఇద్దరు గన్ మెన్లను కేటాయించామని పేర్కొన్నారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు. ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ఓడించేందుకు ఉన్నత విద్యావంతురాలైన షహజాదీని బీజేపీ రంగంలోకి దించింది.

Hyderabad
chandrayangutta
Akbaruddin Owaisi
BJP
AIMIM
shehajadi
Police
Telangana
2 gun men
  • Loading...

More Telugu News