TRS: కూకట్‌పల్లిలో నందమూరి సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ

  • టీడీపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • చెదరగొట్టిన పోలీసులు
  • ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకున్న సుహాసిని

కూకట్‌పల్లిలో ప్రజాకూటమి (టీడీపీ)  అభ్యర్థి నందమూరి సుహాసిని ప్రచారం చేస్తున్న సమయంలో కొంత ఉద్రిక్త పరిస్థితి  తలెత్తింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆదివారం సుహాసిని చేస్తున్న ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ-టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. సకాలంలో స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. సుహాసిని తన ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ కార్యాలయం ముందు నుంచి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసుల రంగ ప్రవేశంతో పరిస్థితి సద్దుమణిగినప్పటికీ సుహాసిని మాత్రం తన ప్రచారాన్ని అర్థాంతరంగా ముగించుకుని వెళ్లిపోయారు.

TRS
Telugudesam
Prajakutami
Kukatpally
Nandamuri suhasini
  • Loading...

More Telugu News