Sonia Gandhi: నాడు సోనియా సభ కోసం... నా సభను కూడా రద్దు చేశారు: కేసీఆర్

  • పులి నోట్లో తలపెట్టి తెలంగాణను తీసుకొచ్చా
  • త్యాగాల తెలంగాణను మహాకూటమి చేతిలో పెడదామా?
  • తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే... టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలి

పులి నోట్లో తలపెట్టి తెలంగాణను తాను తీసుకొచ్చానని... త్యాగాల తెలంగాణను మహాకూటమి చేతుల్లో పెడదామా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఏ పార్టీవాళ్లు తెలంగాణకు వచ్చి ప్రచారం చేసినా సంతోషమేనని... ఎవరైనా వచ్చి ప్రచారం చేసుకోవచ్చని చెప్పారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పత్రికల్లో అబద్ధపు ప్రకటనలు ఇస్తోందని మండిపడ్డారు.  

2014 ఎన్నికల సమయంలో కరీంనగర్, చేవెళ్ల సభలకు సోనియా వచ్చారని... ఆమె వచ్చినందుకు వికారాబాద్ లో తన సభ రద్దైందని చెప్పారు. ఆమెకు స్పెషల్ ప్రొటెక్షన్ ఉండటం వల్ల తన సభను రద్దు చేశారని తెలిపారు. రాహుల్ గాంధీ అయితే ఐదారు సభలకు వచ్చారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కొనసాగాలంటే... టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపించాలని చెప్పారు. మహేందర్ రెడ్డిని గెలిపించాలని... రానున్న ప్రభుత్వంలో ఆయనకు మళ్లీ సముచిత స్థానాన్ని కల్పిస్తామని తెలిపారు.

Sonia Gandhi
kcr
tandoor
congress
TRS
  • Loading...

More Telugu News