modi: మన చౌకీదార్ చేసిన పనికి ఫ్రాన్స్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది: రాహుల్ గాంధీ
- రాఫెల్ డీల్ పై విచారణ జరిపించాలని ఫ్రాన్స్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు
- మోదీ వల్ల ఫ్రాన్స్ ప్రభుత్వం చిక్కుల్లో పడింది
- భారత కాపలాదారుడు దొంగ అని ప్రపంచమంతా అంటోంది
రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణంపై ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మన చౌకీదార్ మోదీ చేసిన పనికి ఫ్రాన్స్ ప్రభుత్వం చిక్కుల్లో పడిందని విమర్శించారు. రాఫెల్ డీల్ పై విచారణ జరిపించాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. మన దేశ గల్లీల్లోనే కాకుండా, ప్రపంచమంతా... 'హిందుస్థాన్ చౌకీదార్ చోర్ (భారత కాపలాదారుడు దొంగ)' అంటోందని ఎద్దేవా చేశారు. ఈమేరకు రాహుల్ ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు. రాఫెల్ డీల్ ద్వారా అనిల్ అంబానీకి మోదీ లబ్ధి చేకూర్చారంటూ గత కొన్ని రోజులుగా రాహుల్ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే.