Oppo R17 Pro: వెనుక వైపు మూడు కెమెరాలతో రానున్న ఒప్పో ఆర్17 ప్రో !

  • డిసెంబర్ 4న భారత మార్కెట్లో విడుదల 
  • డిసెంబర్ 1 నుండే ప్రీ ఆర్డర్లు మొదలు 
  • ధర సుమారుగా రూ.43,000  

మొబైల్ దిగ్గజం ఒప్పో వచ్చే నెల 4న ఆర్17 ప్రో పేరిట నూతన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయబోతోంది. ఇందులో 6.4 ఇంచుల భారీ డిస్ప్లేతో పాటు వెనక భాగంలో 3 కెమెరాలని ఏర్పాటు చేశారు. 8 జీబీ ర్యామ్ వేరియంట్లో గత ఆగష్టులో చైనాలో విడుదలైన ఈ ఫోన్ కి మంచి ఆదరణ లభించింది. చైనాలో విడుదలైన ధరతో పోలిస్తే మన దేశంలో సుమారుగా రూ.43,000కి లభ్యం అయ్యే అవకాశం ఉంది. ఎమెరాల్డ్ గ్రీన్, రేడియంట్ మిస్ట్ కలర్లలో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్  ప్రీ ఆర్డర్లు డిసెంబర్ 1 నుండే మొదలు కానున్నాయి.

'ఒప్పో ఆర్17 ప్రో' ప్రత్యేకతలు:

  • వెనుక భాగంలో 12/20 మెగాపిక్సల్ కెమెరాలతో పాటు 3డీ స్టీరియో కెమెరా
  • 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
  • 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆక్టాకోర్ స్నాప్‌ డ్రాగన్ 710 ప్రాసెసర్
  • 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ ( కలర్ ఓఎస్ 5.2 )
  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
  • 3700 ఎంఏహెచ్ బ్యాటరీ

  • Error fetching data: Network response was not ok

More Telugu News