woman: నగలు కొనేందుకు వచ్చిన యువతిపై షాపు ఓనర్ అత్యాచారయత్నం

  • బెంగళూరులో చోటుచేసుకున్న ఘటన
  • ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతానన్న నగల దుకాణం ఓనర్
  • స్నేహితుల సలహాతో పోలీసులను ఆశ్రయించిన యువతి

ఎన్ని కేసులు నమోదవుతున్నా కామాంధుల ధోరణి మాత్రం మారడంలేదు. నగలు కొనేందుకు వచ్చిన యువతిపై జువెలరీ షాపు ఓనర్ అత్యాచారం  చేసేందుకు యత్నించిన  ఘటన తాజాగా బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరులోని కురుబరహళ్లిలో సుభాష్ అనే వ్యక్తి రిషబ్ జువెలర్స్ పేరుతో నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. 21 ఏళ్ల ఓ యువతి అతని వద్ద తరచుగా నగలు కొనుగోలు చేస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 26న ఆమె దుకాణానికి వెళ్లింది. దుకాణంలో అన్ని మోడల్స్ లేవని, అదే భవనంలో పైఅంతస్తులో ఉన్న తన ఇంట్లో ఉన్నాయని చెప్పి, ఆమెను తీసుకెళ్లాడు.

ఇంట్లోకి వెళ్లగానే, తలుపు వేసి అత్యాచారం చేసేందుకు యత్నించాడు. అయితే, అతని నుంచి ఆమె ఎలాగోలా తప్పించుకుని బయటపడింది. అయితే, తన వద్ద అత్యాచారయత్నం చేసిన వీడియోలు ఉన్నాయని... జరిగిన ఘటన గురించి ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతానని ఆమెను సుభాష్ బెదిరించాడు. చివకు తన స్నేహితురాళ్ల వద్ద ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సుభాష్ ను విచారించగా... అత్యాచారయత్నం చేసినట్టు తేలింది. 

woman
rape attempt
bengaluru
  • Loading...

More Telugu News