India: జామా మసీదును కూలగొట్టండి.. ఆలయ అవశేషాలు దొరక్కుంటే నన్ను ఉరితీయండి!: సాక్షి మహరాజ్

  • వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత
  • మసీదు కింద ఆలయం అవశేషాలు ఉన్నట్లు వెల్లడి
  • మొఘలులు 3వేల ఆలయాలు కూలగొట్టారని వ్యాఖ్య

ఢిల్లీలోని ప్రఖ్యాత జామా మసీదును కూలగొట్టాలని బీజేపీ వివాదాస్పద నేత, పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ వ్యాఖ్యానించారు. జామా మసీదును హిందూ ఆలయాల అవశేషాలతో నిర్మించారని ఆరోపించారు. కావాలంటే మసీదును కూల్చితే దానికింద ఆలయం అవశేషాలు లభ్యమవుతాయని స్పష్టం చేశారు. యూపీలోని ఉన్నావ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సాక్షి మహరాజ్ ఈ మేరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మొఘల్ పాలకులు దేశవ్యాప్తంగా 3,000 ఆలయాలు కూల్చివేసి మసీదులను నిర్మించారని ఆయన తెలిపారు. జామా మసీదు కింద హిందూ ఆలయ ఆనవాళ్లు బయటపడతాయనీ, ఒకవేళ దొరకకుంటే తనను ఉరితీయాలని సవాల్ విసిరారు. సాక్షి మహరాజ్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. హిందూ మహిళలు ఎక్కువ మంది పిల్లలను కని మతాన్ని కాపాడాలనీ, మూకదాడుల్లో ముస్లింలను చంపడం సరైనదేనంటూ గతంలో వ్యాఖ్యానించి ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు.

India
jama masjid
demolisition
temple
hang me
sakshi maharaj
BJP
  • Loading...

More Telugu News