Andhra Pradesh: ‘అనంత’లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దన్న జేసీ.. మీ టికెట్ కూడా గల్లంతు అవుతుందని చంద్రబాబు వార్నింగ్!

  • జిల్లాలో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం
  • ఐదుగురు ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం
  • కార్యకర్తల ముందే క్లాస్ పీకిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ పటిష్టత, నేతల మధ్య విభేదాలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా గుంతకల్, సింగనమల, కల్యాణదుర్గం, కదిరి, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను కుటుంబ సభ్యులకు అప్పగించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మధ్య ఆసక్తికర సంవాదం చోటుచేసుకుంది. అనంతపురంలో పార్టీ గెలవాలంటే సగం మంది సిట్టింగ్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని దివాకర్ రెడ్డి సీఎంకు సూచించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ‘ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనే ఎవ్వరికీ టికెట్ ఇవ్వబోం. రేపు ప్రజా వ్యతిరేకత ఎదురైతే మీకు కూడా పార్టీ టికెట్ ఇవ్వను’ అని సుతిమెత్తగా హెచ్చరించారు. 

Andhra Pradesh
Anantapur District
jc
Chandrababu
Telugudesam
meeting
warn
  • Loading...

More Telugu News