Andhra Pradesh: గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అయ్యప్ప భక్తుల దుర్మరణం

  • తెల్లవారుజామున ఘోర ప్రమాదం
  • ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు
  • మంచు, అతివేగమే కారణమన్న పోలీసులు

అయ్యప్ప స్వామిని దర్శించుకుని శబరిమల నుంచి వస్తున్న ముగ్గురు అయ్యప్ప భక్తులు గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ తెల్లవారుజామున శబరిమల నుంచి వస్తున్న వీరి కారు చిలకలూరిపేట మండలం పాతపూడి సమీపంలో ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది.

ప్రమాదంలో రాజమహేంద్రవరానికి చెందిన పి.దినేశ్ కుమార్ (31), సారథి (26), పి.సుబ్బారావు (35) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన సోమశేఖర్ అనే వ్యక్తిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. తెల్లవారుజామున విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ముందు వెళ్తున్న వాహనాలు కనిపించకపోవడం, అతివేగం ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Andhra Pradesh
Guntur District
Ayyappa
sabarimala
Chilakaluripeta
  • Loading...

More Telugu News