Rahul Gandhi: సోనియా, రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నలుగురు టీఆర్ఎస్ నేతలు

  • మేడ్చల్ బహిరంగసభలో కాంగ్రెస్ లోకి చేరికలు
  • కొండా విశ్వేశ్వర్ రెడ్డి, యాదవరెడ్డి, జగదీశ్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డిల చేరిక
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన రాహుల్ గాంధీ

హైదరాబాద్ శివారు మేడ్చల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభకు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కు చెందిన నలుగురు నేతలు వీరి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి, జనగాం మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి రాహుల్ గాంధీ సాదరంగా ఆహ్వానించారు.

Rahul Gandhi
congress
join
konda visweshwar reddy
yadava reddy
jagadish reddy
kommuri pratap reddy
TRS
  • Loading...

More Telugu News