sama rangareddy: టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు

  • ఫోర్జరీ సంతకాలతో భూమిని కాజేసినట్టు ఫిర్యాదు
  • నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలు చేశారంటూ ఆరోపణ
  • సెక్షన్ 420, 468, 471ల కింద కేసు నమోదు

తెలంగాణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టీడీపీకి కొత్త ఇబ్బంది వచ్చి పడింది. ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. మాదాపూర్ లో కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ సంతకాలతో ఆయన కాజేసినట్టు ఆయనపై ఫిర్యాదు అందింది. నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఫోర్జరీ సంతకాలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సామ రంగారెడ్డిపై 420, 468, 471 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు ఇబ్రహీంపట్నంలో బీఎస్పీ తరపున కాంగ్రెస్ నేత మల్ రెడ్డి రంగారెడ్డి బరిలో ఉన్నారు. అయితే, మల్ రెడ్డికి మహాకూటమితో సంబంధం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. 

sama rangareddy
ibrahimpatnam
Telugudesam
case
  • Loading...

More Telugu News