kcr: చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా.. ఆయన సామాన్యుడు కాదు: కేసీఆర్

  • ఆసరా కోసం చంద్రబాబును కాంగ్రెస్ తీసుకొస్తోంది
  • కత్తి ఆంధ్రోడిదే.. కానీ, పొడిచెటోడు తెలంగాణోడు
  • కాంగ్రెస్ కు ఓటేసి.. చంద్రబాబును గెలిపిద్దామా?

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా? అని టీఎస్ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. నర్సంపేట బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తూ... చంద్రబాబు పాలన తెలంగాణలో అవసరమా? అని అడిగారు. కేటీఆర్ ని ఓడిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని... ఆసరా కోసం చంద్రబాబును తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. 'కత్తి ఆంధ్రోడిదే... కానీ పొడిచెటోడు తెలంగాణోడు' అని ఉద్యమం సమయంలోనే తాను చెప్పానని ఆయన గుర్తు చేశారు.

చంద్రబాబు సామాన్యుడు కాదని... తెలంగాణకు సంబంధించిన ప్రతి అంశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టులను ఆపడానికి 35 లేఖలు రాశారని విమర్శించారు. మన గొంతు కోయాలనుకుంటున్న చంద్రబాబును గెలిపిద్దామా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను గెలిపించి, మనకు నీరు లేకుండా చేయాలనుకుంటున్న చంద్రబాబును గెలిపిద్దామా? అని అడిగారు. తన వంతుగా చంద్రబాబును ఒకసారి తరిమికొట్టానని... ఇప్పుడు మీ వంతు వచ్చిందని చెప్పారు. చంద్రబాబును దెబ్బకొట్టాలంటే... ఆయనను మోసుకొస్తున్న పార్టీని ఓట్లతో దెబ్బకొట్టాలని కోరారు.

2లక్షల 68 వేల డబుల్ బెడ్రూమ్ లు కడతామని చెప్పామని... కట్టితీరుతామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. రానున్న రెండు నెలల్లో ప్రతి ఇంటికి నల్లా బిగించి, నీటిని అందిస్తామని చెప్పారు. 58 ఏళ్లలో పోడు భూముల సమస్యలు పరిష్కారం కాలేదని... ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ బెటర్ అని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని... ఈ అభివృద్ధిని ఇలాగే ముందుకు తీసుకెళదామని చెప్పారు. 

  • Loading...

More Telugu News