ibrahimpatnam: ఇబ్రహీంపట్నంలో అభివృద్ధి తిరోగమనం : సామ రంగారెడ్డి

  • కేసీఆర్‌ ప్రభుత్వం హయాంలో నియోజకవర్గాన్ని గాలికి వదిలేశారు
  • టీడీపీ నుంచి టీఆర్‌ఎస్ లో చేరిన కిషన్‌రెడ్డి దందాలకే పరిమితమయ్యారు
  • అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ

కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో స్థానిక ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, అభివృద్ధి తిరోగమనం చెందిందని మహాకూటమి తరపున పోటీ చేస్తున్న సామ రంగారెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అనంతరం టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారన్నారు. నియోజకవర్గం అభివృద్ధిని పట్టించుకోకుండా భూదందాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ibrahimpatnam
samarangareddy
  • Loading...

More Telugu News