India: సెమీస్ లో బోల్తా కొట్టిన హర్మన్ ప్రీత్ సేన!

  • సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి
  • తొలుత బ్యాటింగ్ చేసి 112 పరుగులకే పరిమితమైన ఇండియా
  • 17.1 ఓవర్లలో ఛేదించిన ఇంగ్లండ్

మహిళల టీ-20 వరల్డ్ కప్ లీగ్ దశలో అప్రతిహతంగా దూసుకొచ్చిన భారత మహిళా క్రికెట్ జట్టు, కీలకమైన సెమీఫైనల్ పోరులో బోల్తాపడింది. గత సంవత్సరం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో ఇంగ్లండ్ తో మ్యాచ్ ని ప్రారంభించిన హర్మన్ ప్రీత్ జట్టు కేవలం 112 పరుగులకే పరిమితమైంది.

స్మృతి మంధాన 34, రోడ్రిగ్స్ 26 మినహా మిగతా వారంతా విఫలం అయ్యారు. 23 పరుగుల వ్యవధిలో భారత జట్టు 8 వికెట్లను చేజార్చుకోవడం గమనార్హం. ఇక టీ-20లో కష్టసాధ్యం కాని 113 పరుగుల విజయలక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్, 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.1 ఓవర్లోనే ఛేదించింది. ఇక ఈ నెల 25న జరిగే ఫైనల్ పోరు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరగనుంది.

India
England
Semifinal
Cricket
Women T-20
Antigua
  • Loading...

More Telugu News