Telangana: తెలంగాణలో చంద్రబాబు-రాహుల్ ప్రచారానికి డేట్ ఫిక్సయింది!

  • 28-29 తేదీల్లో చంద్రబాబు-రాహుల్ ఉమ్మడి ప్రచారం
  • కూకట్‌పల్లిలో ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • ప్రచారంలో పాల్గొననున్న ఏపీ మంత్రులు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు-కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కలిసి తెలంగాణలో నిర్వహించనున్న ప్రచారానికి డేట్ ఫిక్సయింది. ఈ నెల 28-29 తేదీల్లో ఇరు పార్టీల జాతీయ అధ్యక్షులు ఉమ్మడిగా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తెలిపారు. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న నియోజకవర్గాల్లో ఏపీ మంత్రులు కూడా ప్రచారానికి రానున్నట్టు తెలుస్తోంది.

అలాగే, కూకట్‌పల్లిలో నటులు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు వారి సోదరి సుహాసిని కోసం ప్రచారం నిర్వహించనున్నట్టు సమాచారం. అయితే, వారి ప్రచారం ఎప్పుడు ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. తెలంగాణలో ప్రచారం కోసం సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌తో ఆరు పాటలు రాయించిన టీడీపీ, వాటిని వందేమాతరం శ్రీనివాస్‌, ఇతర గాయకులతో పాడించింది. ఈ పాటలతో తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది.

Telangana
Chandrababu
Rahul Gandhi
NTR
Kalyan Ram
Nandamuri Suhasini
  • Loading...

More Telugu News