KCR: కేసీఆర్ నాటిన మొక్కను నరికేసి.. వినాయకుడి విగ్రహం ఏర్పాటు.. తిమ్మాపూర్‌లో కలకలం

  • మూడేళ్ల క్రితం నాటిన కేసీఆర్
  • ఏపుగా పెరిగిన మొక్క 
  • నిందితులపై చర్యలు తప్పవన్న అధికారులు

ముఖ్యమంత్రిగా కేసీఆర్ తన స్వహస్తాలతో నాటిన మొక్కను గుర్తు తెలియని వ్యక్తులు పెకిలించారు. హరితహారం మొదటి విడత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కరకట్ట దిగువన కేసీఆర్ మొక్క నాటారు. మూడేళ్ల క్రితం నాటిన ఆ మొక్క ఏపుగా పెరిగి పెద్దదైంది. అయితే, గుర్తుతెలియని వ్యక్తులు మొక్కను నరికేసి దాని సమీపంలో వినాయకుడి విగ్రహం పెట్టడం కలకలం రేపింది.

బుధవారం వరకు బాగానే ఉన్న మొక్క గురువారం నరికివేతకు గురి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎవరో కావాలనే మొక్కను నరికేసి అక్కడ వినాయక విగ్రహం పెట్టారని భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు మొక్కను పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

KCR
TRS
Haritha Haram
Karimnagar District
Timmaapur
plant
  • Loading...

More Telugu News