: హస్తినలో బీజేపీ నేతల మంతనాలు
దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయ నేతల కీలక సమావేశం జరుగుతోంది. కెప్టెన్ అభిమన్యు ఇంటిలో జరుగుతున్నఈ భేటీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాధ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలు ఎల్ కె అద్వానీ, వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్ లతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. దేశంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ తరపున ప్రధాని అభ్యర్థిత్వం, సంఘ్ పరివార్ తో సంబంధాలు వంటి కీలక అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.