ram madhav: రాంమాధవ్.. మీ ఆరోపణలు నిరూపించండి.. లేదా క్షమాపణలు చెప్పండి: ఒమర్ అబ్దుల్లా
- పాకిస్థాన్ ప్రమేయంతోనే పీడీపీ, ఎన్సీలు చేతులు కలిపాయన్న రాంమాధవ్
- రాంమాధవ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా
- ఆధారాలను ప్రజల ముందుంచాలంటూ డిమాండ్
జమ్ముకశ్మీర్ అసెంబ్లీని ఆ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ ప్రమేయంతోనే ప్రభుత్వ ఏర్పాటు కోసం పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ లు చేతులు కలిపాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. రాంమాధవ్ తాను చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేకపోతే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రా, ఐబీ, ఎన్ఐఏ తో కానీ లేదా మీ పంజరంలో ఉన్న చిలుక సీబీఐతో కానీ విచారణ జరిపించి... ఆధారాలను ప్రజలు ముందు ఉంచాలని అన్నారు. కపట రాజకీయాలను బీజేపీ మానుకోవాలని హితవు పలికారు.