Redmi Note 6 Pro: నాలుగు కెమెరాలతో 'రెడ్ మీ నోట్ 6ప్రో' వచ్చేసింది!

  • రెండు వేరియంట్ లలో లభ్యం 
  • 4జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.13,999
  • 6జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.15,999

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ నుండి నూతన స్మార్ట్ ఫోన్ విడుదలైంది. 'రెడ్ మీ నోట్ 5ప్రో' ఫోన్ కి కొనసాగింపుగా అద్భుత ఫీచర్లతో 'రెడ్ మీ నోట్ 6ప్రో' తాజాగా భారత మార్కెట్లో విడుదలైంది. భారీ బ్యాటరీ, నాలుగు కెమెరాలు లాంటి ఫీచర్లు దీనిలో ఏర్పాటు చేశారు. రేపటి నుండి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ ర్యామ్ అనే రెండు వేరియంట్లలో లభించనుంది. 4 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.13,999 ఉండగా 6 జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.15,999గా ఉంది. బ్లాక్, బ్లూ, రెడ్, రోజ్ గోల్డ్ కలర్లలో లభించే ఈ ఫోన్ పై జియో, హెచ్.డీ.ఎఫ్.సి సంస్థలు పలు ఆఫర్లు కూడా ప్రకటించాయి.

'రెడ్ మీ నోట్ 6 ప్రో' ప్రత్యేకతలు:

  • 12/5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
  • 20/2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు
  • స్నాప్‌ డ్రాగన్‌ 636 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌
  • 6.26 ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్ప్లే ( 2280 x 1080 పిక్సెల్స్‌)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • 4/6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌
  • 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Redmi Note 6 Pro
Four Cameras
Tech-News
technology
China
India
  • Loading...

More Telugu News