balka suman: బాల్క సుమన్ ఓడిపోవడం ఖాయం: కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్

  • బాల్క సుమన్ ఓటమి ఇప్పటికే ఖరారైంది
  • దత్తత తీసుకున్న గ్రామాన్నే ఆయన పట్టించుకోలేదు
  • ఒక్క హామీని కూడా కేసీఆర్ నెరవేర్చలేకపోయారు

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ ఓడిపోవడం ఖాయమని కాంగ్రెస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేశ్ జోస్యం చెప్పారు. ఆయన ఓటమి ఇప్పటికే ఖరారైందని అన్నారు. ఎంపీగా ఉన్న సుమన్ ఆయన దత్తత తీసుకున్న గూడెం గ్రామాన్నే పట్టించుకోలేదని... ఇక ఇతర ప్రాంతాల అభివృద్ధి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు తాను చేపట్టిన సేవా కార్యక్రమాలు, కాంగ్రెస్ మేనిఫెస్టో తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారని వెంకటేశ్ విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ అయిన బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గానికి చేసిందేమిటని ప్రశ్నించారు. 

balka suman
TRS
venkatesh
congress
chennur
  • Loading...

More Telugu News