Rajamouli: 'RRR' మ్యాజిక్... ఫైట్ కోసం 120 కెమెరాలు వాడుతున్న రాజమౌళి!

  • సన్నివేశాలకు 4డీ సాంకేతికత
  • పవర్ ఫుల్ ఎఫెక్ట్స్ చూపనున్న రాజమౌళి
  • వేగంగా సాగుతున్న షూటింగ్

దర్శక దిగ్గజం రాజమౌళి తలపెట్టిన మల్టీస్టారర్ కోసం అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా, పోరాట దృశ్యాలను చిత్రీకరించేందుకు 4డీ టెక్నాలజీని జోడించినట్టు తెలుస్తోంది. ఇద్దరు హీరోల ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని, ఫైట్ సీన్స్ తీసేందుకు ఏకంగా 120 కెమెరాలను జక్కనా తెప్పించారట.

ఈ కెమెరాల్లోని టెక్నాలజీతో వచ్చే ఎఫెక్ట్స్ చాలా పవర్ ఫుల్ గా ఉండనున్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. సీన్స్ లో నటీనటుల హావభావాలు, ముఖ కవళికలను మరింత చక్కగా ఇవి క్యాప్చర్ చేస్తాయట. కాగా, ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ శివార్లలో భారీ సెట్ ను వేశారన్న సంగతి తెలిసిందే. సినిమా కథలో భాగంగా కొంత భాగం అడవుల్లో తీయాల్సి వుండటంతో, 'బాహుబలి'లో వాడిన 'కిలికి'లా, ఆటవికుల భాషగా కొత్త భాషను కనిపెట్టే పనిలో ఉన్నారట రాజమౌళి.

Rajamouli
RRR
NTR
Cameras
4D Technology
Ramcharan
  • Loading...

More Telugu News