railway: రైల్వేశాఖలోనూ ఇక జియో సేవలు.. జనవరి 1 నుంచి అమలుకు సన్నాహాలు!

  • ఇప్పటిదాకా ఎయిర్ టెల్  నుంచి సేవలు
  • జియోతో భారీగా తగ్గనున్న ఖర్చులు
  • వచ్చే ఏడాది నుంచి అమలుకు సిద్ధం

ముఖేశ్ అంబానీ ప్రారంభించిన జియో కంపెనీ టెలికాం మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. ఇప్పటికే చాలామంది యూజర్లు రిలయన్స్ జియోకు మారిపోగా, ప్రభుత్వ సంస్థలు కూడా క్రమంగా ఆ కంపెనీవైపు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో భారతీయ రైల్వే చేరింది.

ఈ విషయమై రైల్వే ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఇప్పటివరకూ భారతీయ రైల్వే ఎయిర్ టెల్ సేవలను వినియోగించుకునేదని తెలిపారు. దాదాపు 1.95 లక్షల మొబైల్ క్లోజ్డ్ యూజర్ గ్రూపులు ఉన్నాయన్నారు. ఈ సేవల కోసం ఎయిర్ టెల్ కు ఏటా రూ.100 కోట్లు చెల్లించాల్సి వచ్చేదన్నారు.

తాజాగా జియో సేవలను వినియోగించుకోవడం ద్వారా ఈ బిల్లు రూ.60-65 కోట్లకు తగ్గిపోతుందని పేర్కొన్నారు. 2019, జనవరి 1 నుంచి జియో సేవలను వినియోగించుకుంటామన్నారు.

  • Loading...

More Telugu News