Crime News: ఒకే కాలనీకి చెందిన ఇద్దరు బాలికల ఆత్మహత్య... ప్రేమ వ్యవహారం అని అనుమానం

  • ముంబయి మహానగరంలోని అరీ కాలనీలో ఘటన
  • తొలుత ఇద్దరూ సెల్ఫీ దిగి అనంతరం బావిలో దూకి బలవన్మరణం
  • తీవ్ర విషాదంలో రెండు కుటుంబాలు

ఒకే కాలనీకి చెందిన ఇద్దరు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తమ కాలనీకి సమీపంలోని ఓ బావి వద్దకు వెళ్లి ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకున్న అనంతరం ఈ విషాదానికి ఒడిగట్డారు. ముంబయి మహా నగరంలోని అరీ కాలనీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలావున్నాయి.

కాలనీకి చెందిన మీనాక్షి ఇంటర్‌ చదువుతోంది. సోనాలీ పదో తరగతి వరకు చదివి కుట్టు శిక్షణ పొందుతోంది. ఇద్దరి వయసు దాదాపు పదిహేనేళ్లే. ఏమయిందో ఏమో ఇంట్లో చెప్పకుండా ఇద్దరూ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెల్ఫీ తప్ప వారి వద్ద ఎటువంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనతో రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.

Crime News
two girls suicide
mumbai
  • Loading...

More Telugu News