Andhra Pradesh: మంత్రి నారా లోకేశ్ సిగ్గులేకుండా పట్టపగలు అబద్ధాలు చెబుతున్నారు!: వైసీపీ నేత రోజా

  • చంద్రబాబు ఆస్తులు రూ.2.9 కోట్లేనా?
  • ఎలా నవ్వాలో చెబితే నవ్వుతాం లోకేశ్
  • ట్విట్టర్ లో విమర్శలు గుప్పించిన వైసీపీ ఎమ్మెల్యే

ప్రజలు ఏమనుకుంటారోనన్న సిగ్గు లేకుండా మంత్రి నారా లోకేశ్ పట్టపగలు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. నిజాలు చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందన్న సామెతను మంత్రి నిజం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఆస్తులు రూ.2.9 కోట్లు ఉంటే అప్పులు రూ.5.31 కోట్లు ఉన్నాయని చెప్పడం హాస్యాస్పదమన్నారు.

ఈ రోజు ట్విట్టర్ లో రోజా స్పందిస్తూ.. ‘చంద్రబాబుకి రూ.2.9 కోట్లు ఆస్తి అంట, రూ.5.31 కోట్ల అప్పులంట.. ఎలా నవ్వాలో చెప్తే నవ్వుతాం లోకేశ్ బాబు. మీ జన్మలో నిజాలు చెప్తే తలలు వెయ్యి ముక్కలు అవుతుంది అనే సామెతను నిజం చేస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అని కొంచెం కూడా సిగ్గు లేకుండా పట్టపగలు పచ్చి అబద్ధాలు ఎలా ఆడుతున్నారు?’ అని ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించి ఓ ఫొటోను రోజా షేర్ చేశారు.

Andhra Pradesh
Chandrababu
Nara Lokesh
Telugudesam
assets declaration
lies
YSRCP
roja
  • Loading...

More Telugu News