Abu Adbhi: మాజీ బాయ్ ఫ్రెండ్ ను దారుణంగా చంపి, కూరొండి పెట్టిన యువతి!

  • అబూధాబీలో కలకలం రేపిన ఘటన
  • తనను దూరం పెట్టాడని కక్ష పెంచుకున్న యువతి
  • నిందితురాలిని పట్టించిన మృతుడి పన్ను

తన మాజీ బాయ్ ఫ్రెండ్ ను దారుణాతి దారుణంగా హత్య చేసి, అతని శరీర భాగాలను కూరొండి, ఇతరులకు పెట్టిందో యువతి. అబూధాబిలో తీవ్ర సంచలనం రేపిందీ ఘటన. 'ఖలీజ్ టైమ్స్' వెల్లడించిన కథనం ప్రకారం, అల్ అనిన్ లో నివాసం ఉంటున్న 30 ఏళ్ల నిందితురాలు, తన మాజీ ప్రియుడిని హతమార్చి ముక్కలు ముక్కలుగా చేసి, శరీర భాగాలను ఓ మొరాకో వంటకంలో వేసి వర్కర్లకు వడ్డించింది.

తనకన్నా చిన్నవాడైన ఫ్రెండ్, తనను దూరం పెడుతుండటం భరించలేకనే ఈ పని చేసినట్టు ఆ యువతి ప్రాసిక్యూషన్ ముందు అంగీకరించింది. ఈ ఘటన చానాళ్ల క్రితమే జరుగగా, ఇటీవల బాధితుడి సోదరుడు అతని గురించి వెతుకుతూ, యువతి ఇంటికి వెళ్లిన తరువాతే, ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. ఆ ఇంట్లో చూస్తుండగా, ఓ మానవ పన్ను కనిపించడంతో దాన్ని తీసుకుని పోలీసులను ఆశ్రయించగా, మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Abu Adbhi
Al Aviv
Murder
Ex Boy Friend
  • Loading...

More Telugu News