Chattisghad: ఈవీఎం ముందు కొబ్బరికాయ కొట్టి, అగర్ బత్తీలు... అడ్డంగా బుక్కయిన బీజేపీ క్యాండిడేట్!

  • చత్తీస్ గఢ్, నవాఘడ్ అభ్యర్థిగా దయాళ్ దాస్ భాగేల్
  • మళ్లీ గెలవాలని ఈవీఎంలకు పూజలు
  • నోటీసులు పంపించిన ఎన్నికల కమిషన్

చత్తీస్ గఢ్ లో మలివిడత పోలింగ్ జరుగుతున్న వేళ, తాను మరోసారి విజయం సాధించాలన్న ఆలోచనతో ఓ బీజేపీ అభ్యర్థి చేసిన పని, ఇప్పుడాయన్ను ఇబ్బందుల్లో పడేసింది. రాష్ట్ర పర్యాటక మంత్రి దయాళ్ దాస్ భాగేల్, నవాఘడ్ (ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఇక ఓటు వేసేందుకు వెళ్లిన ఆయన, ఈవీఎంకు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరికాయకొట్టి, అగరుబత్తీలు వెలిగించి, ఇంకోసారి విజయలక్ష్మి తననే వరించాలని మొక్కాడు. ఈ విషయం తెలుసుకున్న ఈసీ వెంటనే అతనికి నోటీసులు జారీ చేసి, సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. దయాళ్ దాస్ బాగేల్ నుంచి సమాధానం రాగానే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుబ్రత్ సాహూ వెల్లడించారు.

Chattisghad
EVM
Offerings
Coconut
BJP
EC
Notice
  • Loading...

More Telugu News