KCR: మా బావ మెజారిటీ లక్ష దాటాలి: కేటీఆర్

  • సిరిసిల్ల నుంచి హైదరాబాద్ బయలుదేరిన కేటీఆర్
  • మార్గమధ్యంలో సిద్ధిపేట దాబా వద్ద ఆగిన యువనేత
  • సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపిన యువత

"మా బావ మెజారిటీ లక్ష దాటాలి. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి" ఇవి సిద్ధిపేట శివార్లలోని పొన్నాల దాబా వద్ద కేటీఆర్ అన్న మాటలు. సిరిసిల్లలో ప్రచారం ముగించుకుని, హైదరాబాద్ బయలుదేరిన ఆయన, సిద్ధిపేటకు వచ్చిన తరువాత, దాబా వద్దకు వచ్చి, అక్కడ కాసేపు కూర్చుని చాయ్ తాగారు. కేటీఆర్ ను చూసిన పలువురు యువకులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. టీ తాగి, కాసేపు వారితో మాట్లాడి, నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో ఆరాతీశారు. తన బావను గెలిపించేందుకు సహకరించాలని కోరుతూ, అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. కేటీఆర్ మాట్లాడిన దృశ్యాల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

KCR
KTR
Harish Rao
Siddipet
Sirisilla
  • Loading...

More Telugu News