karthikeya: రాజమౌళి ఫ్యామిలీ నుంచి 'ఆకాశవాణి'

  • కార్తికేయ నిర్మాతగా 'ఆకాశవాణి'
  • సంగీత దర్శకుడిగా కీరవాణి తనయుడు 
  • జనవరిలో రెగ్యులర్ షూటింగ్      

ఈ మధ్య కాలంలో కొంతమంది కుర్రాళ్లు ఒక టీమ్ గా ఏర్పడి కొత్త కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. తమ ప్రతిభా పాటవాలను తెరపై ఆవిష్కరించడానికి ఉత్సాహ పడుతున్నారు. అలాంటి ఒక ప్రయత్నంగా 'ఆకాశవాణి' సినిమా రూపొందుతోంది. రమా రాజమౌళి తనయుడు కార్తికేయ తొలిసారిగా నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి, అశ్విన్ గంగరాజు దర్శకత్వం వహించనున్నాడు.

కీరవాణి తనయుడు కాలభైరవ ఈ సినిమాకి సంగీతం అందించనున్నాడు. కాలభైరవ మంచి సింగర్ .. 'బాహుబలి 2'లో 'దండాలయ్యా ..'.. ఇటీవల వచ్చిన 'అరవింద సమేత'లో 'పెనిమిటీ ..' పాటలను ఆయనే ఆలపించాడు. బాగా పాప్యులర్ అయిన ఈ పాటలు ఆయనకి మంచి పేరును తీసుకొచ్చాయి. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

ఈ సినిమా ఫస్టు పోస్టర్ ను వదిలిన సందర్భంగా రాజమౌళి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ .." ఈ సమయంలో నా కంటే ఆనందపడేవాళ్లు ఎవరుంటారు? కార్తికేయ .. కాలభైరవ ఈ సినిమాకి నిర్మాతగా ..సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇక అశ్విన్ గంగరాజు నా దగ్గర ఇంతకు ముందు అసిస్టెంట్ గా పనిచేశాడు. మొత్తం టీమ్ కి గుడ్ లక్" అని చెప్పారు.    

karthikeya
kalabhairava
ashwin
  • Loading...

More Telugu News