kareen kapoor: సారా, ఇబ్రహీంలకు నేనెప్పుడూ తల్లిని కాలేను: కరీనా కపూర్

  • సారా, ఇబ్రహీంలకు మంచి స్నేహితురాలిగా ఉంటా
  • అవసరం వచ్చినప్పుడు మంచి సలహాలు ఇస్తా
  • అమృతలాంటి మంచి అమ్మ ఉన్నప్పుడు.. నేను తల్లిలా ఉండలేను

బాలీవుడ్ నటి కరీనా కపూర్ ను హీరో సైఫ్ అలీఖాన్ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి తైమూర్ అనే పండంటి కుమారుడు జన్మించాడు. అయితే, నటి అమృతా సింగ్ ను సైఫ్ తొలి వివాహం చేసుకున్నాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖeన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సారా ఇటీవలే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. వీరిద్దరు కూడా సైఫ్ తో పాటే ఉంటున్నారు. వీరితో ఉన్న అనుబంధాన్ని కరీనా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది.

సారా, ఇబ్రహీంలకు తానెప్పుడూ తల్లిని కాలేనని కరీనా ఈ సందర్భంగా తెలిపింది. వారిని స్నేహితుల్లా భావిస్తానని... తన అవసరం వచ్చినప్పుడు వారికి సలహాలు ఇస్తానని చెప్పింది. వారికి అందమైన అమ్మ ఉందని... చిన్నప్పటి నుంచి వారిని ఎంతో జాగ్రత్తగా పెంచిందని తెలిపింది. అమృతలాంటి మంచి అమ్మ ఉన్నప్పుడు... తాను వారికి తల్లిగా ఉండలేనని చెప్పింది.

kareen kapoor
saif ali khan
sara
ibrahim
amrita singh
  • Loading...

More Telugu News