Vijayanagaram District: ఈ చిన్నారి మరణాన్ని చూసినా మీరు మారరా?: రోజా నిప్పులు

  • పాఠశాలలో కూలిన గోడ
  • విజయనగరం జిల్లా పాచిపెంటలో చిన్నారి మృతి
  • ట్విట్టర్ ఖాతాలో స్పందించిన రోజా

ఓ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి చిన్నారి దుర్మరణం పాలుకాగా, ఆ ఫోటోను తన సోషల్ మీడియా ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "విజయనగరం జిల్లా పాచిపెంట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి హర్షవర్ధన అనే 3వ తరగతి చిన్నారి దుర్మరణం. ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఉజ్వల భవిష్యత్ ఉన్న బిడ్డ అన్యాయంగా చనిపోయింది. ప్రచారాలకు వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి పాఠశాలలు మెరుగు పర్చాలి" అని రోజా డిమాండ్ చేశారు. హర్షవర్ధన కుటుంబాన్ని ఆదుకోవాలని, రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కనీస వసతులు కల్పించాలని ఆమె కోరారు.



Vijayanagaram District
Roja
Twitter
Student
Wall Collapse
  • Loading...

More Telugu News