Anantapur District: హిందూపురంలో హీరో బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన కార్మికులు.. బయటకు ఈడ్చిపడేసిన పోలీసులు!

  • జీవో 279ను రద్దుచేయాలని డిమాండ్
  • కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన
  • కార్మికులను ఈడ్చిపడేసిన పోలీసులు

అనంతపురం జిల్లా హిందూపురంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హిందూపురంలో సీఎం చంద్రబాబు వియ్యంకుడు, నటుడు బాలకృష్ణ ఇంటిని ఈ రోజు పారిశుద్ధ్య కార్మికులు ముట్టడించారు. ఏపీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొట్టేలా తెచ్చిన జీవో 279ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హిందూపురం మున్సిపాలిటిలో విధుల నుంచి తప్పించిన 220 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. బాలయ్య ఇంటిలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు.. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కార్మికులతో పాటు సీఐటీయూ నేతలను బయటకు ఈడ్చిపడేశారు. అనంతరం ఆందోళనకారులను వ్యానులో పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ..  జీవో 279 తో కార్మికుల భవితవ్యాన్ని ఏపీ ప్రభుత్వం ప్రమాదంలోకి నెట్టిందని వాపోయారు. ఈ జీవోతో కాంట్రాక్టర్లకు సర్వాధికారాలు దక్కుతాయని వ్యాఖ్యానించారు. వెంటనే ఈ జీవో రద్దు చేసి 220 మంది పారిశుద్ధ్య ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Anantapur District
hindupur
Balakrishna
house
muncipal workers
GO 279
  • Loading...

More Telugu News