Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికల ఎంటర్ టైనర్ గా మారారు: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • రాహుల్, అసదుద్దీన్ ‘భాయ్..భాయ్’ అనుకున్నారు!
  • అసదుద్దీన్ ప్రచారానికి వెళ్లకుండా ‘కాంగ్రెస్’ డబ్బు  
  • దీనిపై కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలి

ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీలు ‘భాయ్..భాయ్’ అనుకున్నారని, ఒవైసీ ఎన్నికల ఎంటర్ టైనర్ గా మారారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఒవైసీ ప్రచారానికి వెళ్లకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తానంటూ కాంగ్రెస్ పార్టీ ఆఫర్ చేసిన విషయమై ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో మహాకూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.500 కోట్లు పంపిస్తున్నారని, ఆ డబ్బులో నుంచి ఒవైసీకి రూ.25  లక్షలు ఇస్తామని చెప్పి ఉంటారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో పరిపాలనపై జీవీఎల్ విమర్శలు గుప్పించారు. ప్రజలు కేంద్రంగా కాకుండా, కుటుంబసభ్యులు కేంద్రంగా పరిపాలనలు సాగుతున్నాయని విమర్శించారు. కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి నందమూరి సుహాసినికి టికెట్ లభించడంపై ఆయన విమర్శలు చేశారు.

Asaduddin Owaisi
bjp
gvl
Chandrababu
congress
  • Loading...

More Telugu News