modi: మోదీ, కేసీఆర్ లకు జగన్, పవన్ లు ఏజెంట్లుగా పని చేస్తున్నారు: రఘువీరారెడ్డి

  • తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ, జనసేనలు నామినేషన్ కూడా వేయలేదు
  • టీఎస్ లో ఏ పార్టీకి మద్దతిస్తున్నారో చెప్పాలి
  • జగన్, పవన్ లు బీజేపీకి బీ-టీమ్ గా మారారు

వైసీపీ అధినేత జగన్, జనసేనాని పవన్ కల్యాణ్ లపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్, పవన్ లు ప్రధాని మోదీ, టీఎస్ సీఎం కేసీఆర్ లకు ఏజెంట్లుగా పని చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఎన్నికల్లో వైసీపీ, జనసేనలు కనీసం నామినేషన్లు కూడా వేయలేదని విమర్శించారు. ఈ విషయంపై వారి పార్టీ కార్యకర్తలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే పోటీ చేయలేనివారు... పార్లమెంటు ఎన్నికల్లో ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తున్నారో జగన్, పవన్ లు చెప్పాలని డిమాండ్ చేశారు.

బీజేపీకి తెలంగాణలో టీఆర్ఎస్ బీ-టీమ్ అని... ఏపీలో కూడా జగన్, పవన్ లు ఆ పార్టీకి బీ-టీమ్ గా మారారని రఘువీరా అన్నారు. బీజేపీ మాదిరే వీరిద్దరినీ కూడా ఏపీ ప్రజలు నిషేధిస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రభంజనాన్ని తట్టుకోలేమనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని... దీనికి మోదీ మద్దతు కూడా ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పారు. 

modi
kcr
jagan
Pawan Kalyan
raghuveera reddy
congress
bjp
TRS
YSRCP
janasena
  • Loading...

More Telugu News