KTR: కేటీఆర్ బ్రదర్ .. యూ విల్ రాక్: దేవిశ్రీ ప్రసాద్ గ్రీటింగ్స్

  • సిరిసిల్ల నుంచి వరుసగా నాలుగో సారి పోటీ పడుతున్న కేటీఆర్
  • అభినందనలు తెలిపిన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్
  • ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్య

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగో మారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కే తారక రామారావుకు ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచారు. "ఆల్ ది వెరీ బెస్ట్ డియర్ బ్రదర్ (సర్)!... ఎప్పటిలానే... యూ విల్ రాక్" అని వ్యాఖ్యానించారు. అంతకుముందు తాను నామినేషన్ వేసిన సందర్భంగా తీసిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేసిన కేటీఆర్... తనకు ఆశీస్సులు, అభినందనలు కావాలని కోరిన సంగతి తెలిసిందే. దానిపై దేవి శ్రీ ప్రసాద్ స్పందించగా, ఆయన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

KTR
Devi Sri Prasad
Twitter
Nomination
Sirisilla
  • Loading...

More Telugu News