Telangana: నామినేషన్ పత్రాలను తగలబెట్టిన ఎల్బీనగర్ మహిళా అభ్యర్థులు

  • మధ్యాహ్నం 3 గంటలు దాటాక వచ్చిన నేతలు
  • గడువు ముగియడంతో అనుమతించని పోలీసులు
  • కార్యాలయం బయటే తగలబెట్టిన వైనం

ఎల్బీనగర్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించిన మహిళా నేత ఉపేంద్రయాదవ్, ప్రజాబంధు పార్టీ అభ్యర్థి ఎన్. రోజాలకు చేదు అనుభవం ఎదురైంది. నామినేషన్ల చివరి రోజైన సోమవారం వారు నామినేషన్లు దాఖలు చేసేందుకు మధ్యాహ్నం 3:03 గంటలకు  రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. అయితే, మూడు గంటలకే నామినేషన్ల గడువు ముగియడంతో వారిని కార్యాలయంలోకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో మరోమార్గం లేని వారు బయటే ఉండిపోయారు. అనంతరం కార్యాలయం బయటే తమ నామినేషన్ పత్రాలను తగలబెట్టారు.

Telangana
Hyderabad
LB Nagar
Nominations
Upendra yadav
N.Roja
  • Loading...

More Telugu News