Telugudesam: నందమూరి సుహాసినికి రాజమండ్రిలో సీటు ఇచ్చి గెలిపించాల్సింది: కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణారావు
- నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు
- నామినేషన్ దాఖలు చేసిన కృష్ణారావు
- సుహాసిని తనకి సోదరితో సమానమన్న కృష్ణారావు
నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున ఈరోజు అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థిగా మాధవరం కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ప్రత్యర్థి అయిన నందమూరి సుహాసినిపై పలు వ్యాఖ్యలు చేశారు. సుహాసిని తనకి సోదరితో సమానం అని, ఆమెకి రాజమండ్రిలో సీటు ఇచ్చి గెలిపించాల్సిందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరో వైపు కూకట్‌పల్లి బీజేపీ అభ్యర్థిగా మాధవరం కాంతారావు కూడా నామినేషన్ దాఖలు చేశారు.