Punjab: పంజాబ్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారి ఆచూకీ చెబితే రూ. 50 లక్షల రివార్డు!

  • అమృతసర్ శివార్లలో ఉగ్రదాడి
  • గ్రనేడ్లు విసిరిన ఇద్దరు వ్యక్తులు
  • ఆపై పారిపోతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డు
  • సమాచారం ఇస్తే భారీ రివార్డు ప్రకటించిన పంజాబ్ సీఎం

పంజాబ్ లో ఉగ్రదాడికి పాల్పడిన వారు పారిపోతుండగా, లభించిన సీసీటీవీ ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేశారు. దాడికి పాల్పడిన వారి గురించిన సమాచారం తెలియజేస్తే రూ. 50 లక్షల రివార్డును అందిస్తామని పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రకటించారు. పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ 181కు ఫోన్ చేయాలని, వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని అన్నారు.

నిన్న అమృతసర్ శివార్లలోని నిరంకారీ భవన్ ను టార్గెట్ చేసుకుని వీరు దాడికి పాల్పడగా, ముగ్గురు మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 20 మంది గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఖలిస్థాన్, కశ్మీరీ ముఠాల పని కావచ్చని అభిప్రాయపడ్డ అమరీందర్, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

కాగా, సీసీటీవీ ఫుటేజ్ వివరాల ప్రకారం, వీరిలో ఒకరు జీన్స్, షర్ట్ ధరించగా, మరొకడు కుర్తా పైజమా వేసుకుని ఉన్నాడు. వీరిద్దరి ముఖాలకూ మాస్క్ లు ఉండటంతో వీరెవరన్నది స్పష్టంగా తెలియడం లేదు.

Punjab
Amrutasir
CCTV
Reward
Terrorists
  • Loading...

More Telugu News