Jagan: 301వ రోజు జగన్ ప్రజాసంకల్ప యాత్ర.. రూట్ మ్యాప్ విడుదల చేసిన వైసీపీ!

  • నేడు తోటపల్లి రిజర్వాయర్ వద్ద యాత్ర ప్రారంభం
  • ప్రజలను పరామర్శిస్తూ ముందుకెళుతున్న జగన్
  • సీమనాయుడు వలస వరకూ సాగనున్న పాదయాత్ర

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ 301వ రోజు ప్రజాసంకల్ప యాత్ర విజయనగరం జిల్లాలో ప్రారంభమైంది. కురుపాం నియోజకవర్గంలోని తోటపల్లి రిజర్వాయర్ నుంచి ఈ రోజు ఉదయం 7.30 గంటలకు పాదయాత్ర ప్రారంభమయింది. జగన్ ప్రజాసంకల్పయాత్ర తోటపల్లి క్రాస్, నందివానివలస, గిజబ, దత్తివలస, గవరమ్మపేట, పేదమేరంగి జంక్షన్ మీదుగా సీమనాయుడు వలస వరకూ సాగనుంది.

పాదయాత్రలో భాగంగా జగన్ దత్తవలస వద్ద మధ్యాహ్నం భోజనం చేసి విశ్రాంతి తీసుకోనున్నారు. అనంతరం ప్రజలను కలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. నియోజకవర్గంలోని సీమనాయుడు వలస వద్ద రాత్రికి వైసీపీ అధినేత విశ్రాంతి తీసుకోనున్నారు. కాగా తనను కలుసుకునేందుకు వచ్చిన అశేష జనవాహినిని పలకరిస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు. 

Jagan
YSRCP
prajasankalpa yatra
Vijayanagaram District
route map
released
301st day
  • Loading...

More Telugu News