24 Kisses: యాంకర్ జాఫర్ వ్యాఖ్యలపై అసహనం... టీవీ-9 చర్చలో నుంచి లేచి వెళ్లిపోయిన హీరోయిన్ హెబ్బా పటేల్... వీడియో చూడండి!

  • '24 కిస్సెస్'పై చర్చా కార్యక్రమం
  • సీన్లు వల్గర్ గా ఉన్నాయన్న వ్యాఖ్యలపై దుమారం
  • ముద్దులతో పాటు చాలా ఉన్నాయని చెబుతూ వెళ్లిపోయిన హెబ్బా

టాలీవుడ్ లో తెరకెక్కిన కొత్త చిత్రం '24 కిస్సెస్'లో చాలా సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని చర్చ సాగుతున్న వేళ, వార్తా చానల్ 'టీవీ-9' ఓ చర్చా కార్యక్రమాన్ని నిర్వహించగా, గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ సినిమాలో సీన్లు వల్గర్ గా ఉన్నాయని అంటున్నట్టు యాంకర్ జాఫర్ చెప్పగా, చిత్ర యూనిట్ అభ్యంతరం పెట్టింది.

ఆపై చర్చ పక్కదారి పట్టగా, తాము నాలుగు గోడల మధ్య జరిగే సీన్లను, నాలుగు గోడల మధ్య జరిగినట్టుగానే చూపామని యూనిట్ వివరణ ఇచ్చింది. ఇదే విషయమై హెబ్బా పటేల్ స్పందిస్తూ, ఈ చిత్రంలో కేవలం ముద్దు సీన్లను మాత్రమే హైలైట్ చేస్తున్నారని, సినిమాలో ఇంకా చాలా ఉందని చెబుతూ తాను ఈ కార్యక్రమం నుంచి వెళ్లిపోతున్నట్టు ప్రకటించి, వెళ్లిపోయింది. సినిమాలో కిస్ సీన్ ను వల్గర్ అనడం 'పర్వర్షన్' అని హీరో అదిత్ అరుణ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని మీరూ చూడవచ్చు.

24 Kisses
Hebba Patel
TV9
Jafer
  • Error fetching data: Network response was not ok

More Telugu News