Hyderabad: విజయశాంతి హెలికాప్టర్ లో నిండుకున్న ఇంధనం.. రోడ్డు మార్గాన పయనం!

  • కాంగ్రెస్ కు స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న విజయశాంతి
  • ఆసిఫాబాద్ జిల్లాలో మల్లు భట్టి విక్రమార్కతో కలసి ప్రచారం
  • హెలికాప్టర్ కదలక రోడ్డుమార్గాన హైదరాబాద్ కు

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్యేక హెలికాప్టర్ లో రాష్ట్రాన్ని చుట్టివస్తున్న కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతికి చేదు అనుభవం ఎదురైంది. భట్టి విక్రమార్కతో కలసి విజయశాంతి పర్యటన ఆసిఫాబాద్ జిల్లాలో సాగుతున్న వేళ, హెలికాప్టర్ లో ఇంధనం అయిపోయింది.

జైనూల్ లో హెలికాప్టర్ దిగిన తరువాత, సాయంత్రం 4 గంటల సమయంలో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరేందుకు వారు సిద్ధం అవుతుండగా, ఇంధనం అయిపోయిందని పైలట్లు వెల్లడించారు. దీంతో వారు చేసేదేమీ లేక, మరో వాహనాన్ని తెప్పించుకుని రోడ్డు మార్గాన హైదరాబాద్ కు బయలుదేరారు. ఇంధనం ఎంత ఉందన్న విషయాన్ని ముందే ఎందుకు తెలుసుకోలేదంటూ, ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు పైలట్ పై అసహనాన్ని ప్రదర్శించారు.

Hyderabad
Vijayasanti
Mallu Bhatti Vikramarka
Kumaram Bheem Asifabad District
Helecopter
  • Loading...

More Telugu News