New Delhi: రబ్రీదేవి ఇంటికి వెళ్లి ఏడుస్తూ బయటకు వచ్చిన కోడలు ఐశ్వర్య తల్లి!

  • ఢిల్లీలోని రబ్రీ క్వార్టర్స్ కు వచ్చిన పూర్ణిమ
  • వియ్యపురాలితో కాసేపు మాటామంతీ
  • వెళ్లేటప్పుడు కన్నీటితో బయటకు

తన కుమార్తె ఐశ్వర్య, అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ల కాపురాన్ని ఎలాగైనా చక్కదిద్దాలన్న ఉద్దేశంతో ఉన్న పూర్ణిమా దాస్, తన వియ్యపురాలు రబ్రీదేవి ఇంటికి వచ్చి చర్చలు జరిపారట. ఢిల్లీలో రబ్రీ బస చేసే క్వార్టర్స్ కు వచ్చిన ఆమె, వెళ్లేటప్పుడు ఏడుస్తూ వెళ్లిపోయారని తెలుస్తోంది. లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడైన తేజ్ ప్రతాప్ యాదవ్ కు, ఐశ్వర్యకు జరిగిన వివాహం మూన్నాళ్ల ముచ్చటే అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్యా విభేదాలు పెరగడంతో ఈ జంట విడిపోయేందుకు సిద్ధమైంది. వీరిని కలపాలని రెండు కుటుంబాలూ ప్రయత్నిస్తున్నాయి. ఈ విషయంలో తేజ్ ప్రతాప్ సైతం తన కుటుంబీకులపై సంచలన ఆరోపణలు చేశారు. ఇంట్లోని వారంతా ఐశ్వర్యకు మద్దతిస్తున్నారని, ఇష్టం లేని కాపురానికి తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించిన సంగతి తెలిసిందే.

New Delhi
Rabri Devi
Aishwarya
Tej Pratap Yadav
  • Loading...

More Telugu News